VIDEO: వేసవికాలం ప్రారంభంలో ఎండిపోతున్న చెరువులు
శ్రీకాకుళం జిల్లాలో వేసవికాలం ప్రారంభంలో మంచినీటి చెరువులు, సాగునీటి చెరువులు ఎండిపోతున్నాయని స్థానికులు తెలిపారు. రబీసీజన్ పంటలతో పాటు, స్నానాలకు, పశువులను కడుక్కునేందుకు, రజకులు బట్టలు ఉతుక్కునేదుందుకు ఈ చెరువులు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. కొన్ని చెరువులు పూర్తిగా నీరు లేకుండా ఎండిపోగా, మరికొన్ని చెరువుల్లో నీరు అడుగుగంటుతుందని వెల్లడించారు.