ఆశా కార్యకర్తల జీతాలు చెల్లించాలి

SKLM: ఆశా కార్యకర్తలకు మార్చి నెల బకాయి వేతనం రూ.7,200 వెంటనే చెల్లించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె నాగమణి డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలలో మార్చి నెల వేతనం చెల్లించినా, అధికారుల జాప్యంతో జీతం రాలేదని అన్నారు.