గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల వసతి సౌకర్యాలపై విద్యార్థులతో చర్చించారు. పాఠశాలలో పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.