గ్రేటర్ హైదరాబాదులో పెరిగిన బీర్ల అమ్మకాలు

గ్రేటర్ హైదరాబాదులో పెరిగిన బీర్ల అమ్మకాలు

HYD: హైదరాబాదులో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీనితో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో చల్లటి బీర్ల కొరత ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌లో లిక్కర్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.3,272.32 కోట్ల ఆదాయం సమకూరగా కేవలం గ్రేటర్ జిల్లాల నుంచే రూ.1,160 కోట్లకుపైగా ఆదాయం సమకూరిందని ప్రభుత్వం ప్రకటించింది.