చెరువులో పిచ్చి మొక్కలు తొలిగింపు

SKLM: రణస్థలం పంచాయితీలోని చిన్న లంక పేట గ్రామంలో చెరువు పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోవడం స్థానికులు సర్పంచ్ పిన్నింటి భానోజి నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఉపాధి హామీ పనుల్లో భాగంగా చెరువుల మొక్కలు తొగలిగించే కార్యక్రమం చేపట్టారు. రాబోయే రోజుల్లో చేపల చెరువుగా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామని భరోసా ఇచ్చారు.