తిరుమల ఆలయం వద్ద భక్తుల ఘర్షణ

TPT: తిరుమల గుడి ముందు కొందరు భక్తులు ఘర్షణకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న వీఐపీ బ్రేక్ దర్శనాల తర్వాత సర్వదర్శనాలు మొదలయ్యాయి. భక్తులు క్యూలో నెట్టుకుంటూ ముందుకు కదిలారు. ఈ క్రమంలో మహద్వారం వద్దకు రాగానే మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని దర్శనానికి వచ్చి గొడవ పడటం ఏంటని సర్ది చెప్పారు.