ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు

NLG: శ్రీరామ పర్వదినం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.