అధ్వానంగా మారిన రహదారి
PDPL: మంథని మండలంలోని సూరయ్యపల్లి-రచ్చపల్లి R&R కాలనీ, ఖమ్మంపల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా ఉంది. పొలాల్లో నీరు కల్వర్ట్ లేక రోడ్లపైకి చేరి వాహనదారులకు ఇబ్బందులు సృష్టిస్తోంది. స్థానికులు సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతుందని తెలిపారు. సంబంధిత అధికారులను కల్వర్ట్ నిర్మించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.