VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు
MDK: రామాయంపేట మండలGలోని దామరచెరువు గ్రామ శివారులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.