VIDEO: 'మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి'

VIDEO: 'మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి'

VZM: పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందరూ తీసుకుంటే అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని గంట్యాడ ఐసీడీఎస్ సీడీపీవో ఉమా భారతి అన్నారు. శుక్రవారం కిట్టుబర్తి అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రీయ పోషణ మాస ఉత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు ఆహారంలో మునగాకును తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎల్లమ్మ, పైడిరాజు పాల్గొన్నారు.