రేపాలలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

రేపాలలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

నల్గొండ: మునగాల మండలం రేపాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చివలూరి రామకృష్ణ చార్యులు స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి 4 వేల మంది భక్తులు హాజరయ్యారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చైర్మన్‌ సారిక చిన్నరామయ్య అన్ని ఏర్పాట్లు చేశారు.