వరద బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో శనివారం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పర్యటించారు. ఎస్సీ, బీసీ కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరిన విషయాన్ని తెలుసుకుని, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మంత్రిని కలిసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.