రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో భద్రాద్రి

BDK: ఎగువ నుంచి వచ్చే వరదలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు 47.4 అడుగులు దాటింది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికే దుమ్ముగూడెం, తూరుబాక వద్ద రహదారిపైకి నీరు చేరడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.