అక్రమంగా గ్రావెల్ తరలింపు.. పట్టించుకోని అధికారులు
నెల్లూరు జిల్లాలోని పొదలకూరుకు కిలో మీటరు దూరంలో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే అక్కడ ఉన్న తిప్పపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో రాత్రి వేళల్లో అక్రమంగా భారీ యంత్రాలు పెట్టి గ్రావెల్ తరలిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. తిప్ప చుట్టూ భారీ గుంతలు ఏర్పడటంతో లబ్ధిదారులు తాము ఉండలేమని వాపోతున్నారు.