ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు
SRD: నేషనల్ మీన్స్- కమ్- మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్‌కు అర్హులని, విద్యార్థులు తమ దరఖాస్తులను www.bse.telangana.gov.in లో సూచించారు. ఈ గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.