పోలేరమ్మ గుడి నిర్మాణానికి కావలి ఎమ్మెల్యే శంకుస్థాపన

NLR: కావలి రూరల్ మండలం అన్నగారి పాలెం పంచాయతీ కుమ్మరిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న పోలేరమ్మ గుడి శంకుస్థాపన కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుడి నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తారని తెలిపారు.