పాఠశాలకు తాళం.. ఉపాధ్యాయుల కొరత పై ధర్నా
NGKL: పదర మండలం ఇప్పలపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను ఇతర గ్రామాలకు పంపిస్తున్నారని ఆరోపిస్తూ, మంగళవారం పాఠశాలకు తాళాలు వేసి గ్రామ పంచాయతీ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఎంఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడ్డారు.