నేడు ఏలూరులో మ్యూజియం ప్రారంభం
ఏలూరులోని రామకోటి సమీపంలో ఏర్పాటు చేసిన జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఇవాళ ప్రారంభించనున్నారని పురావస్తు శాఖ సహాయ సంచాలకులు తిమ్మరాజు తెలిపారు. జిల్లా చరిత్రను ప్రతిబింబించేలా, వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అపురూపమైన పురాతన అవశేషాలను ఇక్కడ కొలువుదీర్చారు.