మానవత్వం చాటుకున్న పోలీసులు

మానవత్వం చాటుకున్న పోలీసులు

అన్నమయ్య: రాయచోటి బస్టాండ్ వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, మానవతా సంస్థ సభ్యులు కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ శంకరరాజు బృందం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతిని నిర్ధారించారు. అనంతరం పట్టణ శివారులోని స్మశాన వాటికలో దహన సంస్కారాలు జరిగాయి. పోలీసులకు,సేవా సభ్యులను పలువురు అభినందించారు.