డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన

డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన

KMM: వ్యవసాయ సాగులో డ్రోన్‌ల వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని ఏవో బి. తారాదేవి కోరారు. మంగళవారం కామేపల్లి రైతు వేదికలో 'రైతు నేస్తం' వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకృతి వ్యవసాయం, డ్రోన్‌ల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. పెట్టుబడి తగ్గి, లాభాలు పెరిగేలా రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు.