VIDEO: శివ ధనుర్బాణాలంకరణలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి శివ ధనుర్బాణాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.ముందుగా ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి తులసి గజ మాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారిని గ్రామోత్సవానికి కేరళ వాయిద్యాలు, కోలాటాల నడుమ అంగరంగ వైభవంగా ఊరేగించారు.