'పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

'పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

ASF: ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఇంఛార్జ్ DEO, అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లాలో 6,949 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 38 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 500 మంది ఇన్విజిలేటర్లు నియమించినట్లు తెలిపారు.