మదనపల్లిలో పట్టాలను పంపిణీ చేసిన ఛైర్మన్
MLG: మదనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు గ్రంథాలయ ఛైర్మన్ బానోతు రవిచందర్ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఇండ్లను నిర్మించే సమయంలో ప్రభుత్వ నియమ, నిబంధనలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని తెలిపారు. లబ్ధిదారులకు వెనువెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.