శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ADB: నెరడిగొండ వ్యవసాయ మార్కెట్‌లో మార్కుఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, అధికారులు రైతులకు అవగాహన కల్పించి సహకరించాలని సూచించారు. కష్టపడి పండించిన పంటలను తక్కువ ధరలకు అమ్మితే రైతులు నష్టపోతారని తెలిపారు.