పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి అసహనం

GNTR: తెనాలిలోని బాలాజీరావుపేట, మారీసుపేట ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. కొన్నిచోట్ల రోడ్లపైనే వ్యర్థాలు, మురుగుతో నిండిన కాలువలను చూసి అధికారులు, సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు కాల్వలు శుభ్రం చేయించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.