వర్షాలకు ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త

ASR: అరకు మండలం ఎండపల్లివలస గ్రామంలో పారిశుద్ధ్యం పడకవేసింది. ఎండపల్లివలసలోని పలు వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొట్టుకుపోయిన చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఉందన్నారు. దీంతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు.