బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు వీడ్కోలు

నిజామాబాద్: ఆర్మూర్ బాలుర ఉన్నత పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు 3 ఆఫీస్ సబార్డినేట్స్ బదిలీపై వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకొని వారి సేవలను అభినందిస్తూ బదిలీ వీడ్కోలు కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు పుప్పాల లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ.. బదిలీపై వెళ్లిన వారు సమయపాలన, అంకిత భావంతో పనిచేయాలన్నారు.