మోదీపై అభ్యంతరకర పోస్టులు.. బీజేపీ నేతలు ఫిర్యాదు
AP: ప్రధాని మోదీపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వ్యక్తిపై రాష్ట్ర బీజేపీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్స్ వేదికగా రుద్రరాజు అనే పేరుతో ఉన్న ఖాతా ద్వారా ప్రధాని వ్యక్తిగత పరువుకు భంగం కలిగేలా పోస్టులు చేస్తున్నారని వారు ఆరోపించారు. సదరు వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.