ఖజానా చెరువులో మొసలి కలకలం
NRML: నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రి పేటలోని ఖజానా చెరువులో మొసలి సంచారం కలకలం రేపుతోంది. చెరువు ఒడ్డున ఉన్న ఓ బండరాయిపై మొసలి పిల్ల తిరుగుతూ స్థానికులకు కనిపించింది. దీంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల మనుషులను చూసిన మొసలి వెంటనే చెరువులోకి వెళ్లిపోయింది.