'ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదు'

'ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదు'

అన్నమయ్య: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహించరాదని జిల్లా అదనపు SP  వెంకటాద్రి ఆదేశించారు. జిల్లా SP ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.