రాజన్న ఆలయంలో భారీ బదిలీలు
TG: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు జరిగాయి. ఆలయ ఈవో రమాదేవి ఏకంగా 17 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఇందులో ఇద్దరు ఏఈవోలు, నలుగురు సూపరింటెండెంట్లు, ఇద్దరు సీనియర్ ఆసిస్టెంట్లు కూడా ఉన్నారు. అటు ప్రసాదం గోదాంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటప్రసాద్ రాజును అంతర్గత బదిలీతో సరిపెట్టారు.