ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

NLG: మాజీ ప్రధాని, భారతదేశ చరిత్రలో అజరామర నాయకురాలు, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరై, ఇందిరా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఆమె సేవలను కొనియాడారు.