TGSRTC SC,ST ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా దారా భాస్కర్
MBNR: టీజీఎస్ఆర్‌టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా టీపీసీసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ దారా భాస్కర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. సంఘ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.