'ఎన్నికల నియామావళి ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలి'
JGL: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల విధులు, విధానాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్‌కుడా పాల్గొన్నారు.