రంగనాథ స్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు

రంగనాథ స్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు

WGL: నగరంలోని కాశిబుగ్గ రంగనాథస్వామి దేవాలయంలో బుధవారం నుంచి కార్తికమాస పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు స్వామి వారికి ప్రత్యేక అర్చనలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాలయం మాజీ అధ్యక్షుడు వంగరి రవి దంపతులు ఉన్నారు.