'భూముల కబ్జాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు'
NZB: ప్రభుత్వ, ప్రైవేట్ భూముల కబ్జాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నాగేపూర్, ఫకీరాబాద్, యంచ, నందిగామ, నవీపేటలో సోమవారం ఆయన పర్యటించి మాట్లాడారు. మండలంలో ఒకరికి చెందిన భూమిని మరొకరు పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.