ఈ నెల 25న పాలిసెట్ పరీక్ష
BPT: ఈ నెల 25న ఉ. 11 గం. నుంచి మ. ఒంటి గంట వరకు రేపల్లె, చీరాల, బాపట్ల ప్రభుత్వ కళాశాలల్లో పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఈ విషయాన్ని రేపల్లె కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులు 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సమస్యలు ఉంటే కో-ఆర్డినేషన్ నెంబర్లు రేపల్లే 89784 21087, 94906 62454, బాపట్ల 94948 32424, చీరాల 72073 43778 సంప్రదించాలని సూచించారు.