తాటి చెట్టు నుంచి పడి గీతా కార్మికునికి తీవ్ర గాయాలు
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గీతా కార్మికుడు బత్తిని రాజు అలియాస్ స్టాలిన్ (36) ప్రమాదవశాత్తు ఇవాళ తాటి చెట్టు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు.