VIDEO: రోడ్డు ప్రమాదంలో కోనసీమ వాసి మృతి

కోనసీమ: రంగారెడ్డి జిల్లా మియాపూర్ సమీపంలో గోపాల్ నగర్‌లో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం బొర్రాపాలెంకు చెందిన దోనిపాటి నాగరాజు(35) మృతి చెందాడు. అతను అక్కడ ల్యాబ్ టెక్నీషియన్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఉదయం బ్లడ్ శాంపిల్ తీసుకుని వస్తుండగా స్కూల్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నారు.