శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి క్షీరాభిషేకం

ATP: గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ముందుగా 108 క్షీరాభిషేక కళాశాలతో రామస్వామి ఆలయం నుండి అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.