మౌలిక వసతులకు రూ.10 కోట్లతో టెండర్లు..!
కృష్ణా: విద్యాధరపురం బస్ డిపోలో విద్యుత్ బస్సుల హబ్ ఏర్పాటులో భాగంగా మౌలిక సదుపాయాలకు టెండర్లను ఆహ్వానించారు. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. నీటి సరఫరా, పారిశద్ధ్యం, విద్యుత్ సదుపాయం పలు పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది టెంగర్లు వేయగా 15న తెరుస్తామన్నారు. ఏ ఏ పనులు ఎవరికి దక్కాయనే వివరాలు వెల్లడించనున్నారు.