తల్లిపాలు బిడ్డకు శ్రేష్ఠం: ఎమ్మెల్యే
VZM: శుక్రవారం ఎస్.కోటలోని ఎండీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహర పక్షోత్సవం-2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన మహిళా శక్తివంతమైన కుటుంబానికి పునాది అని అన్నారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, తల్లిపాలు తాగడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోందన్నారు.