గుణదల వంతెనపై వినాయకుడి నిమజ్జనం

గుణదల వంతెనపై వినాయకుడి నిమజ్జనం

NTR: విజయవాడ గుణదల బీఆర్టీఎస్ రోడ్డులోని కాలువ వద్ద ఫెన్సింగ్ లేకపోవడంతో వినాయకుడి విగ్రహాలను, పూజా సామాగ్రిని ప్రజలు నేరుగా కాలువలోనే నిమజ్జనం చేస్తున్నారు. ఇటీవల అధికారులు కాలువల్లోని వ్యర్థాలను తొలగించినప్పటికీ, నిమజ్జనం కారణంగా తిరిగి వ్యర్థాలు చేరుతున్నాయి. కాలువ ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని, అధికారులు తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.