VIDEO: సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి
SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం గనగళ్ల వాని పేట సముద్ర తీర ప్రాంతాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శంకర్ బుధవారం పరిశీలించారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో తీరం కోతకు గురైందని మత్స్యకారులు తెలిపిన నేపథ్యంలో కేంద్రమంత్రి స్థానిక అధికారులతో కలిసి పరిస్థితులను పరిశీలించారు. తీర రేఖ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.