కనువిందు చేస్తున్న దేవగన్నేరు వృక్షాలు

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని రాంపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆవరణంలో దేవగన్నేరు వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. సుమారు 70-80 ఏళ్ల క్రితం నాటిన మొక్కలు మహవృక్షాలై విరబూసి చూపరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ పూలను దేశంతో పాటు ఇతర దేశాలలో పూజలు, ఔషధాలలో ఉపయోగిస్తారని స్థానికులు తెలిపారు.