వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు
CTR: వైకుంఠ ఏకాదశిన శ్రీవారి దర్శనానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా TTD ఆధ్వర్యంలో చర్యలు చేపట్టినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. పుంగనూరులోని శ్రీకళ్యాణ వేంకన్నస్వామి వారి ఆలయంలో ఆదివారం ఏర్పాట్లను సీఐ సుబ్బరాయుడు పరిశీలించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు పరిశీలించారు.