క్లాప్ మిత్రలు ప్రతి ఇంటిని సందర్శించాలి: DPO

క్లాప్ మిత్రలు ప్రతి ఇంటిని సందర్శించాలి: DPO

ప్రకాశం: సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వర రావు ఇవాళ సందర్శించారు. క్లాప్ మిత్రలు తమకు కేటాయించిన ప్రతి ఇంటిని నిత్యం సందర్శించి 'తడి చెత్త - పొడి చెత్త' పూర్తిగా వేర్వేరుగా సేకరించాలని ఆయన ఆదేశించారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.