నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

MDK: మెదక్ మండలంలోని ఎన్ఎస్ఎఫ్, ర్యాలమడుగు, మక్తభూపతిపూర్, పాతూరు సబ్స్టేషన్లలో నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏడీఈ మోహన్బాబు తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా విద్యుత్ తీగలు మరమ్మతులు, ట్రీ కట్టింగ్, స్తంభాల మార్పులు వంటి పనుల నేపథ్యంలో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అంతరాయం కలుగుతుందన్నారు.