VIDEO: వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
HNK: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేగా ఈరోజు ఉదయాన్నే తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.