సెలెబీ ఏవియేషన్ సంస్థ కీలక ప్రకటన

సెలెబీ ఏవియేషన్ సంస్థ కీలక ప్రకటన

సెలెబీ ఏవియేషన్ సంస్థ కీలక ప్రకటన చేసింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. టర్కీ అధ్యక్షుడి కుమార్తె తమ సంస్థకు అధిపతి కాదని కూడా పేర్కొంది. దేశంలోని 9 ఎయిర్‌పోర్టుల్లో సెలెబీ సంస్థ తమ సేవలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెలెబీ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేయడంతో తాజాగా ఈ ప్రకటన వెలువడింది.